వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు
విశాఖపట్నం, 22 జూలై (హి.స.)సికింద్రాబాద్‌- విశాఖపట్నం(Secunderabad-Visakhapatnam) మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య
వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల గడువు పొడిగింపు


విశాఖపట్నం, 22 జూలై (హి.స.)సికింద్రాబాద్‌- విశాఖపట్నం(Secunderabad-Visakhapatnam) మధ్య నడుస్తున్న వందేభారత్‌ రైళ్లకు అదనపు స్టాపేజీల సదుపాయాన్ని మరో ఆరునెలల పాటు పొడిగిస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్‌ నుంచి విశాఖపట్నం మధ్య నడిచే 20707/20708 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌(Vande Bharat Express) రైళ్లకు ఫిబ్రవరిలో ప్రారంభించిన అదనపు స్టాపేజీ (ఏలూరు) సదుపాయం ఆగస్టులో ముగియనుందని సీపీఆర్‌వో శ్రీధర్‌ తెలిపారు.

దీంతో ఆగస్టు 25నుంచి ఏలూరు(Eluru)లో, 20833/20834 వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‏లకు ఆగస్టు 2నుంచి సామర్లకోట(Samarlakota)లో అదనపు స్టాపేజీలు మరో ఆరునెలల పాటు కొనసాగుతాయని ఆయన పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande