శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి సమయం ఎంతంటే?
తిరుమల, 22 జూలై (హి.స.) కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది. ఈ క్రమంలో నేడు(మంగళవారం) శ్రీవేంకటేశ్వ
తిరుమల


తిరుమల, 22 జూలై (హి.స.)

కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల(Tirumala) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని నిత్యం వేలాది మంది భక్తులు(Devotees) దర్శించుకుంటారు. గత కొన్ని రోజుల నుంచి తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతూనే ఉంది.

ఈ క్రమంలో నేడు(మంగళవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారి దర్శనానికి 18 గంటల సమయం పడుతోంది.

భక్తులు కంపార్ట్‌మెంట్లు దాటి అతిథి గృహం వెలుపల వరకు వేచి ఉన్నారు. క్యూలైన్‌లోని భక్తులకు శ్రీవేంకటేశ్వర స్వామి వారి సేవకుల ద్వారా అన్నప్రసాదం, పాలు, తాగునీరు అందిస్తున్నారు. నిన్న(సోమవారం) శ్రీవేంకటేశ్వర స్వామి వారిని 77,481మంది భక్తులు దర్శించుకున్నారు. 30,612 మంది తలనీలాలు సమర్పించుకున్నారు.

శ్రీవేంకటేశ్వర స్వామి వారి హుండీ ఆదాయం(Hundi Income) రూ.3.96 కోట్లు వచ్చిందని టీటీడీ(TTD) అధికారులు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande