ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ 26, 27 తేదీల్లో నిరసనలు
విజయవాడ, 23 జూలై (హి.స.) విజయవాడలోని గవర్నర్‌పేట-1 డిపో, పాతబస్టాండ్‌ స్థలాలను లులూ షాపింగ్‌ మాల్‌కు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఈనెల 26, 27 తేదీల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ
ఆర్టీసీ స్థలాన్ని ప్రైవేటుకు ఇవ్వడాన్ని నిరసిస్తూ 26, 27 తేదీల్లో నిరసనలు


విజయవాడ, 23 జూలై (హి.స.) విజయవాడలోని గవర్నర్‌పేట-1 డిపో, పాతబస్టాండ్‌ స్థలాలను లులూ షాపింగ్‌ మాల్‌కు ఇవ్వాలన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నిరసనగా రాష్ట్రంలోని అన్ని డిపోల్లో ఈనెల 26, 27 తేదీల్లో నిరసనలు చేపట్టాలని నిర్ణయించినట్టు నేషనల్‌ మజ్దూర్‌ యూనిటీ అసోసియేషన్‌ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పీవీ రమణారెడ్డి, వై.శ్రీనివాసరావులు ఒక ప్రకటనలో తెలిపారు.

అసోసియేషన్‌ రాష్ట్ర కమిటీ సమావేశాన్ని అత్యవసరంగా నిర్వహించామని, ప్రైవేట్‌ సంస్థలకు ఆర్టీసీ స్థలాలను ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ నిరసనలు తెలియజేయాలని సమావేశంలో నిర్ణయించినట్లు తెలిపారు

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande