కొత్త రైల్వే లైన్ మంజూరు.. కేంద్ర మంత్రికి ఎంపీ అర్వింద్ ధ‌న్య‌వాదాలు
హైదరాబాద్, 23 జూలై (హి.స.) నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు – ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష
ఎంపీ అరవింద్


హైదరాబాద్, 23 జూలై (హి.స.)

నిజామాబాద్ లో రైల్వే సౌకర్యాల విస్తరణకు సంబంధించి మరో ప్రాజెక్ట్ కి ముందడుగు పడింది. గత రెండేళ్లుగా ఆర్మూర్ మీదుగా పటాన్ చెరు – ఆదిలాబాద్ మధ్య కొత్త రైల్వే లైన్ వేయాలని నిజామాబాద్ ఎంపీ అర్వింద్, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ ని పలుమార్లు కోరిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ ప్రాజెక్టు మంజూరైంద‌ని రైల్వే మంత్రి, ఎంపీ అర్వింద్ కి లేఖ రాశారు. ప్రస్తుతం ఈ ప్రాజెక్టుకు సంబంధించి డీపీఆర్ తయారు చేస్తున్నారని, డీపీఆర్ పూర్తయిన తర్వాత తదుపరి చర్యలు చేపడతామని మంత్రి లేఖలో పేర్కొన్నారు. కాగా తన విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించి, ఉత్తర తెలంగాణలో ముఖ్యమైన నూతన రైల్వే లైన్ మంజూరు చేసినందుకు ఎంపీ అర్వింద్, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ కి ధన్యవాదాలు తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande