ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .పెట్టుబడులను.ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక.ముందడుగు
అమరావతి, 23 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సదస
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో .పెట్టుబడులను.ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక.ముందడుగు


అమరావతి, 23 జూలై (హి.స.) ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పెట్టుబడులను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన ముందడుగు వేసింది. ఈ నేపథ్యంలో ఇన్వెస్టోపియా గ్లోబల్- ఏపీ పేరిట ఏర్పాటు చేసిన ప్రత్యేక సదస్సు విజయవాడలో ఈరోజు ఉదయం 11 గంటలకు ప్రారంభం కానుంది. ఈ సదస్సును ఇన్వెస్ట్ ఇండియా మరియు కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీస్ (CII) సంయుక్తంగా నిర్వహిస్తుంది. ఈ సమావేశానికి ఏపీ సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరవుతున్నారు.

ఇక, ఈ సదస్సులో యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కి చెందిన వివిధ ప్రముఖ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలు పాల్గొంటున్నారు. సుమారు 200 మంది యూఏఈ ప్రతినిధులు హాజరయ్యే ఛాన్స్ ఉంది. ఈ సందర్భంగా రాష్ట్రంలోని పెట్టుబడి అవకాశాలు, ఆర్థికాభివృద్ధికి సంబంధించిన అంశాలపై ముఖ్యంగా చర్చించే అవకాశం ఉంది. యూఏఈ మంత్రులు, సీఎండీలు, సీఈఓలు, ఇతర పారిశ్రామిక ప్రముఖులు ఈ మీటింగ్ కు హాజరుకానున్నారు.

అయితే, నాలుగు అంశాలపై కీలక చర్చ జరగనుంది. భారత్-యూఏఈ ఆర్థిక సంబంధాలు బలోపేతంపై ప్రధానంగా చర్చించనున్నారు. పెట్టుబడులకు ముఖ ద్వారంగా రాష్ట్రం అనే అంశంపై మొదట చర్చ జరగనుంది. ఈసమావేశంలో ఇన్వెస్టోపియా సీఈఓ డాక్టర్ జీన్ ఫేర్స్.. సీఐఐ వైస్ ప్రెసిడెంట్, భారత్ బయోటెక్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకురాలు, ఎండీ డాక్టర్ సుచిత్ర కె.ఎల్ల పాల్గొనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ


 rajesh pande