పాఠశాలలను ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన కలెక్టర్
మహబూబాబాద్, 23 జూలై (హి.స.) మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల యొక్క అభ్యసన సామర్ధ్యాలను స్వయంగా పరి
మహబూబాబాద్ కలెక్టర్


మహబూబాబాద్, 23 జూలై (హి.స.)

మహబూబాబాద్ జిల్లాలోని గూడూరు మండల కేంద్రంలో ఉన్న కేజీబీవీ, జిల్లాపరిషత్ ఉన్నత పాఠశాలలను జిల్లా కలెక్టర్ అద్వైత్ కుమార్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.

ఈ సందర్భంగా ఆయన విద్యార్థుల యొక్క అభ్యసన సామర్ధ్యాలను స్వయంగా పరిశీలించారు. ప్రతీ సబ్జెక్టుపై పట్టు సాధించే విధంగా ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులు బోధన కొనసాగించాలని ఆదేశించారు.

పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుంటూ నిత్యం సానిటేషన్ నిర్వహించాలని సూచించారు. డైట్ మెనూ ప్రకారం నాణ్యమైన ఆహారాన్ని అందించాలని, షెడ్యూల్ ప్రకారం విద్యార్థిని విద్యార్థులకు వైద్య పరీక్షలు నిర్వహించి ప్రతి విద్యార్థి యొక్క హెల్త్ ప్రొఫైల్ విధిగా మెయింటైన్ చేయాలని ఆదేశించారు.

జిల్లా లోనీ ప్రత్యేక అధికారులు అందరూ వారికి కేటాయించిన అన్ని వసతి గృహాలను విధిగా తనిఖీ చేసి నివేదికల సమర్పించాలని ఆదేశించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande