హైదరాబాద్, 23 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా
కురుస్తున్న వర్షాలతో ప్రభుత్వం అప్రమత్తం అయింది. ఇప్పటికే అన్ని జిల్లాల కలెక్టర్లకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్రమత్తంగా ఉండాలని సూచించారు. హైదరాబాద్ లో భారీ వర్షాల నేపథ్యంలో ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ హైదరాబాద్ సిపి సివి ఆనంద్, కలెక్టర్ దాసరి హరిచందన, జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి కర్ణన్, హైడ్రా కమిషనర్ రంగనాథ్, మెట్రో వాటర్ వర్క్స్, ట్రాఫిక్ అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని, హైదరాబాద్ లోని 141 వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ప్రత్యేక సిబ్బందిని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఎన్టీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సైతం అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..