కలుషిత నీరు తాగి తండ్రీకొడుకులు మృతి.. కాంగ్రెస్ సర్కార్పై మండిపడ్డ హరీశ్రావు
హైదరాబాద్, 23 జూలై (హి.స.) గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడడంపై సోషల
హరీశ్రావు


హైదరాబాద్, 23 జూలై (హి.స.) గ్రామాల ప్రజలకు సురక్షితమైన

నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో రాష్ట్ర ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని మాజీ మంత్రి హరీశ్రావు అన్నారు. కామారెడ్డి జిల్లా, తాడ్వాయి మండలం దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడడంపై సోషల్ మీడియా ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందించారు. దేమికలాన్ గ్రామంలో ఊరు ఊరంతా డయేరియా బారిన పడి ఒక్కొక్కరిగా ప్రాణాలు కోల్పోతుంటే ప్రభుత్వం ఏం చేస్తున్నట్లు అని ప్రశ్నించారు. కలుషిత నీరు తాగి తండ్రి, కొడుకులు మృతి చెందటం అత్యంత బాధాకరం అని ఆవేదన వ్యక్తం చేశారు.

శుభ్రమైన తాగునీరు సరఫరాలో రూరల్ వాటర్ సప్లై డిపార్ట్మెంట్, పారిశుద్ధ్య నిర్వహణలో పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్, విపత్కర పరిస్థితుల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టడంలో రెవెన్యూ డిపార్ట్మెంట్, మొత్తంగా పల్లెలు, గ్రామాల ప్రజలకు సురక్షితమైన నీరు, పరిశుభ్రమైన వాతావరణం కల్పించడంలో ప్రభుత్వం ఘోరంగా ఫెయిల్ అయిందని ఆయన పేర్కొన్నారు. దేమికలాన్ గ్రామంలో మెడికల్ ఎమర్జెన్సీ ప్రకటించి, వెంటనే మెడికల్ క్యాంప్లు ఏర్పాటు చేసి ప్రజల ప్రాణాలు కాపాడాలని బీఆర్ఎస్ పార్టీ పక్షాన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande