కోల్ బెల్ట్ ఏరియాలో కుండపోత వర్షాలు.. నిలిచిన బొగ్గు ఉత్పత్తులు!!
తెలంగాణ, పెద్దపల్లి. 23 జూలై (హి.స.) కోల్ బెల్ట్ ఏరియా లో ఎడతెరిపిలేని భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విస్తారమైన వర్షాల కారణంగా రామగుండం రీజియన్లు, మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియా
సింగరేణి బొగ్గు


తెలంగాణ, పెద్దపల్లి. 23 జూలై (హి.స.)

కోల్ బెల్ట్ ఏరియా లో ఎడతెరిపిలేని భారీ వర్షాలతో సింగరేణి ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో బొగ్గు ఉత్పత్తులకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. విస్తారమైన వర్షాల కారణంగా రామగుండం రీజియన్లు, మందమరి, శ్రీరాంపూర్, బెల్లంపల్లి ఏరియా, భద్రాది కొత్తగూడెం ప్రాంతాల్లోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో వరద నీరు చేరుకుంది.. అక్కడ బొగ్గు ఉత్పత్తులకు అంతరాయం ఏర్పడుతుంది. పర్యావసరంగా సింగరేణి బొగ్గు పరిశ్రమలోని ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఒకరోజు లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తికి ఆటంకం కలిగినట్లు తెలుస్తోంది.రామగుండం రీజియన్ లోని 1,2,3,5 ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో సుమారుగా 80వేల పైచిలుకు టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రి నుండి బుధవారం ఉదయం వరకు నిరంతరంగా కుండపోత వర్షంతో… ఉపరితల గనుల్లోకి భారీగా వరద నీరు చేరుకుంది. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టులన్నీ కూడా వర్ధనీటితో జలమయంగా కనిపిస్తున్నాయి. ఓపెన్ కాస్ట్ ప్రాజెక్టుల్లో ఓబి మట్టి తీత పనులు పూర్తిగా నిలిచిపోయాయి. వరద నీరు చేరడంతో… భారీ యంత్రాలు, భారీ వాహనాలు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande