మండలానికి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ : కోమటిరెడ్డి రాజ్ గోపాల్ రెడ్డి
తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 24 జూలై (హి.స.) యాదాద్రి భువనగిరి జిల్లాలోని తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రదానంగా తండాలలో నెలకొన్న ఉన్న భూ సమస్యలు, అర్హులైన నిరుపేదలకు ఇందిర
కోమటిరెడ్డి


తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 24 జూలై (హి.స.)

యాదాద్రి భువనగిరి జిల్లాలోని తండావాసులు ఎదుర్కొంటున్న సమస్యలను మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అడిగి తెలుసుకున్నారు. ప్రదానంగా తండాలలో నెలకొన్న ఉన్న భూ సమస్యలు, అర్హులైన నిరుపేదలకు ఇందిరమ్మ ఇండ్ల మంజూరు, దశబ్దాలుగా పెండింగ్ లో ఉన్న పింఛన్లు, రోడ్ నెట్వర్క్ సమస్యలను తండావాసులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకువచ్చారు. నేడు మార్నింగ్ వాక్కులో ఎమ్మెల్యే మాట్లాడుతూ... అర్హులైన ప్రతి పేదవారికి ఇందిరమ్మ ఇండ్లు ఇప్పించే బాధ్యత నాదని,

గిరిజన తండాల్లో రోడ్డు సమస్య తీవ్రంగా ఉందని త్వరలోనే అన్ని తండాలకు లింకు రోడ్లను ఏర్పాటు చేయిస్తానన్నారు. కొడుకులకు చిన్న ప్రభుత్వ ఉద్యోగం ఉంటే గత ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వలేదని,ప్రభుత్వ ఉద్యోగం ఉన్న తల్లిదండ్రులకు పెన్షన్లు ఇచ్చే విధంగా సీఎంతో మాట్లాడతానన్నారు.

పూర్తిగా అంగవైకల్యం ఉన్న వికలాంగులకు మండలానికి ఒక రిహాబిలిటేషన్ సెంటర్ ను ప్రభుత్వం లేదా కోమటిరెడ్డి సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా త్వరలోనే ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చారు. పార్టీ ఏదైనా ధర్మంగా, న్యాయంగా సంక్షేమ పథకాలు అందరికీ అందేలా పనిచేస్తానని తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande