అమరావతి, 25 జూలై (హి.స.)
అమరావతి: ఏపీ ఆయుష్ విభాగంలో 358 పోస్టుల భర్తీకి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. 71 మంది డాక్టర్లు, 26 జిల్లాలకు ప్రోగ్రాం మేనేజర్లు, సహాయకులతో పాటు 90 మంది పంచకర్మ థెరపిస్టులతో కలిపి మొత్తం 358 మంది నియామకాలకు మంత్రి ఆమోదం తెలిపారు. ఆయుష్ సేవల విస్తరణ కోసం సత్వర నియామకాలు చేపట్టాలని అధికారులను ఆయన ఆదేశించారు. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనా కాలంలో ఆయుష్ సేవలపై కేవలం రూ.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసి ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. 2024-25 సంవత్సరానికి కేంద్రం ఆమోదించిన స్టేట్ యాన్యువల్ యాక్షన్ ప్లాన్‌లో భాగంగా పలు కార్యక్రమాలు చేపట్టామని మంత్రి వివరించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ