అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శం : స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్
తెలంగాణ, వికారాబాద్. 25 జూలై (హి.స.) ప్రపంచ మేధావి భారత దేశ గర్వించదగ్గ గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పట్లూర్ గ్రామంలో ఆగస్ట్ 3 వ
స్పీకర్ గడ్డం ప్రసాద్


తెలంగాణ, వికారాబాద్. 25 జూలై (హి.స.)

ప్రపంచ మేధావి భారత దేశ గర్వించదగ్గ గొప్ప మహోన్నత వ్యక్తి డాక్టర్ బి. ఆర్ అంబేద్కర్ అని తెలంగాణ రాష్ట్ర స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ పేర్కొన్నారు. వికారాబాద్ జిల్లా మర్పల్లి మండలంలోని పట్లూర్ గ్రామంలో ఆగస్ట్ 3 వ తేదీన జరగబోయే అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరణ పోస్టర్ ను శుక్రవారం మర్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా స్పీకర్ మాట్లాడుతూ.. అంబేద్కర్ జీవితం ప్రతి ఒక్కరూ ఆదర్శంగా తీసుకోవాలి అని ఆయన చూపించిన మార్గంలో యువత ముందుకు నడవాలని పిలుపునిచ్చారు. అదే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి అని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande