తెలంగాణ, 25 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్రంతో పాటు మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలు కారణంగా గోదావరి ఉపనదులు ప్రాణహిత, ఇంద్రావతి ఉప్పొంగి గోదావరిలో కలుస్తుండటంతో గోదావరికి పెద్ద ఎత్తున వరద నీరు వచ్చి చేరుతుంది. దీంతో భద్రాచలం వద్ద గోదావరి వేగంగా పెరుగుతుంది. శుక్రవారం ఉదయం 6 గంటలకు 21 అడుగులు ఉన్న గోదావరి, మధ్యాహ్నం 12 గంటలకు 23.50 అడుగులకు పెరిగి ప్రవహిస్తుంది. 2,57,086 క్యూసెక్కుల నీరు దిగువకు తరలివెళ్ళింది. భద్రాచలం ఏజెన్సీ లోని చర్ల మండలంలో ఉన్న తాలిపేరు ప్రాజెక్టు కు కూడా భారీగా వరద నీరు వచ్చి చేరడంతో ఒక గేటు రెండు అడుగుల మేర, 6 గేట్లు పూర్తిగా ఎత్తి 24,905 క్యూసెక్కుల నీటిని దిగువనున్న గోదావరిలోకి వదిలారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు