మెట్రో పై రాష్ట్ర ప్రభుత్వానికి అవగాహన లేదు..కిషన్ రెడ్డి
హైదరాబాద్, 25 జూలై (హి.స.) హైదరాబాద్ మెట్రో ఫేస్- 2 గురించి తెలంగాణ ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యనే డిపీఆర్ కేంద్రానికి వచ్చింది.. మెట్రోపై అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది.. మె
కిషన్ రెడ్డి


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

హైదరాబాద్ మెట్రో ఫేస్- 2 గురించి

తెలంగాణ ముఖ్యమంత్రి పచ్చి అబద్దాలు చెబుతున్నారని కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ఆరోపించారు. ఈ మధ్యనే డిపీఆర్ కేంద్రానికి వచ్చింది.. మెట్రోపై అవగాహన లేకుండా రాష్ట్ర ప్రభుత్వం మాట్లాడుతుంది.. మెట్రో గురించి కాంగ్రెస్ సర్కార్ ఇంకా సమాచారం ఇవ్వాల్సి ఉంది.. సీఎంకి మెట్రో గురించి అవగాహన లేదు.. మెట్రో లైన్ల నిర్వాహణ ఎవరు చేస్తారు.. నష్టాలు ఎవరు భరిస్తారు.. గతంలో ఇచ్చిన సంస్థకు రెండో దశ నిర్మాణ నిర్వాహణ ఇస్తారా.. కొత్త సంస్థ వస్తే వాటితో సమన్వయం ఒప్పందం అంశాలు కేంద్రానికి తెలియజేయాల్సి ఉంటుందన్నారు. మెట్రో విషయంలో కేంద్రం రాష్ట్రానికి సహకారంతో పాటు నిధులను ఇస్తుంది.. మెట్రో విషయంలో కేంద్ర- రాష్ట్ర అధికారులతో సమావేశం ఏర్పాటుకు మోడీ సర్కార్ సిద్ధంగా ఉంది అని కిషన్ రెడ్డి వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande