ఆరోగ్య కేంద్రాన్ని ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ
తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 25 జూలై (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి అన్ని వార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జనరల్ వ
కలెక్టర్ రాహుల్ శర్మ


తెలంగాణ, జయశంకర్ భూపాలపల్లి. 25 జూలై (హి.స.) జయశంకర్ భూపాలపల్లి జిల్లాలోని చిట్యాల

మండల కేంద్రంలోని సామాజిక ఆరోగ్య

కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ శర్మ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆస్పత్రి అన్ని వార్డులను క్షుణ్ణంగా తనిఖీ చేశారు. జనరల్ వార్డులో పేషెంట్ల ఆరోగ్య పరిస్థితిని, ల్యాబ్,ఆపరేషన్ థియేటర్ ను స్వయంగా తిరుగుతూ, ఇంతకుముందు హాస్పిటల్ లో చేరిన వారి వివరాలను రిజిస్టర్ ను చూస్తూ, అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆరోగ్య కేంద్రాల్లో అవసరమైన డాక్టర్లను ఏర్పాటు చేస్తామని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande