పేదవాడి ఎన్నో ఏళ్ల కల సాకారం అయింది : ఎమ్మెల్యే కూనంనేని
తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 25 జూలై (హి.స.) కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను కొత్తగూడెం లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జ
ఎమ్మెల్యే కూనంనేని


తెలంగాణ, భద్రాద్రి కొత్తగూడెం. 25 జూలై (హి.స.)

కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో

నూతనంగా మంజూరైన రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమాలను కొత్తగూడెం లో శుక్రవారం ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు, జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొత్తగూడెం శాసనసభ్యులు కూనంనేని మాట్లాడుతూ.. ఎన్నో సంవత్సరాలుగా రేషన్ కార్డు కోసం ఎదురుచూస్తున్న పేదవారి కల నేడు సాకారమైందన్నారు. గత ప్రభుత్వ కాలంలో రేషన్ కార్డుల పంపిణీ ఆగిపోవడంతో పేదలు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి సంక్షేమాన్ని దృష్టిలో పెట్టుకుని సమర్థంగా రేషన్ కార్డుల పంపిణీ చేపట్టింది అని తెలిపారు.

ఇప్పటివరకు కొత్తగూడెం నియోజకవర్గ పరిధిలో మొత్తం 4,633 కొత్త రేషన్ కార్డులు మంజూరు చేయగా 7,962 కార్డుల్లో కుటుంబ సభ్యుల వివరాలు జతపరచడం జరిగిందన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande