పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే జగిత్యాల ఆదర్శం.. ఎమ్మెల్యే సంజయ్ కుమార్
తెలంగాణ, జగిత్యాల. 25 జూలై (హి.స.) పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చూడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. పట్టణంలోని 23, 24, 25 వార్డులలో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంజయ్ కుమార్ శు
ఎమ్మెల్యే సంజయ్


తెలంగాణ, జగిత్యాల. 25 జూలై (హి.స.)

పచ్చదనం పరిశుభ్రతలో దేశానికే

జగిత్యాల ఆదర్శంగా ఉండేలా చూడాలని జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్కుమార్ సూచించారు. పట్టణంలోని 23, 24, 25 వార్డులలో రూ.30 లక్షల నిధులతో చేపట్టిన సీసీ రోడ్ల నిర్మాణానికి సంజయ్ కుమార్ శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగిత్యాల పట్టణం అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తానని చెప్పారు.

జగిత్యాల శివారు ప్రాంతాలను పట్టణంలో విలీనం చేయడమైనదని, దీని వల్ల జగిత్యాల విస్తరించి అభివృద్ధి వేగంగా పెరిగిందని తెలిపారు. రాష్ట్రంలోనే జగిత్యాల కు అత్యధిక నిధులు మంజూరయ్యాయని, జగిత్యాల ను ఆదర్శంగా ఉండేలా చేయాల్సిన బాధ్యత అధికారులతో పాటు ప్రజలది కూడా ఉంటుందని చెప్పారు. ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు త్వరలో వినియోగంలోకి తీసుకొస్తామని చెప్పారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande