అమరావతి, 25 జూలై (హి.స.)
విశాఖపట్నం: నగర ప్రజల ప్రతిష్టాత్మకమైన మెట్రో రైలు ప్రాజెక్టు ఎట్టకేలకు గాడిలో పడుతోంది. అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ (AMRC) కొద్దిసేపటి క్రితం మెట్రో నిర్మాణానికి సంబంధించిన టెండర్ షెడ్యూల్‌ను విడుదల చేసింది. మొత్తం రూ. 11,498 కోట్ల అంచనా వ్యయంతో మూడు ప్రధాన కారిడార్లలో 46.23 కిలోమీటర్ల మేర మెట్రో నిర్మాణానికి ఈ టెండర్లు పెట్టినట్లు అధికారులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ