రాజకీయ ఒత్తిడికి తలొగ్గొద్దు.. నూతన సీడీపీవోలకు మంత్రి సీతక్క దిశానిర్దేశం
హైదరాబాద్, 25 జూలై (హి.స.) ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు అంగన్ వాడీలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇందులో భాగంగా అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా నూతనంగా చైల్డ్ డె
మంత్రి సీతక్క


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచనల మేరకు అంగన్ వాడీలను దేశానికి రోల్ మోడల్ గా తీర్చిదిద్దుతున్నామని మంత్రి సీతక్క అన్నారు. ఇందులో భాగంగా అనేక మార్పులు తీసుకువస్తున్నామని చెప్పారు. ఇటీవల టీజీపీఎస్సీ ద్వారా నూతనంగా చైల్డ్ డెవలప్ మెంట్ ప్రాజెక్టు ఆఫీసర్లు గా ఎంపికైన 23 మందికి ఇవాళ సచివాలయంలో మంత్రి సీతక్క నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా నూతన సీడీపీవోలకు అభినందనలు తెలిపిన సీతక్క.. సీడీపీవోలు మహిళా శిశు సంక్షేమ శాఖ వెన్నెముక లాంటివారని మీరంతా ఎలాంటి రాజకీయ ఒత్తిడిలకు లొంగాల్సిన అవసరం లేదన్నారు. స్వేచ్ఛగా అంకితభావంతో విధులు నిర్వహించాలన్నారు. మహిళా శిశు సంక్షేమ శాఖ సేవా దృక్పథంతో, మానవతతో పనిచేసే శాఖ అని అన్నారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande