రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవం.. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.
తెలంగాణ, జగిత్యాల. 25 జూలై (హి.స.) రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్థానిక బీఎల్ఎన్ గార్డెన్లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 10 వేల 17 కొత్త తెలుపు రంగు రేషన్ కార్డులను శుక్
మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్.


తెలంగాణ, జగిత్యాల. 25 జూలై (హి.స.)

రేషన్ కార్డు అనేది పేదల ఆత్మ గౌరవమని రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. స్థానిక బీఎల్ఎన్ గార్డెన్లో జగిత్యాల అర్బన్, రూరల్ మండలాలకు చెందిన 10 వేల 17 కొత్త తెలుపు రంగు రేషన్ కార్డులను శుక్రవారం లబ్ధిదారులకు జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్, కలెక్టర్ బీ సత్య ప్రసాద్ తో కలిసి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ..

కొత్తగా రేషన్ కార్డు పొందిన వారికి రాష్ట్ర ప్రభుత్వం మహాలక్ష్మి, గృహజ్యోతి పథకాలకు దరఖాస్తు చేసుకునేందుకు తాజాగా అవకాశం కల్పించిందని తెలిపారు. రేషన్ కార్డుల స్థితిని పౌరసరఫరాల శాఖ వెబ్సైట్లో తెలుసుకోవచ్చని, రేషన్ కార్డుల పంపిణీ నిరంతర ప్రక్రియ అని, కార్డు రాని వారు మీ సేవా కేంద్రాల్లో దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. తెలంగాణ ప్రత్యేకంగా రాష్ట్రంగా ఏర్పడిన తర్వాత రేషన్ కార్డుల పంపిణీ ఆశించిన మేర జరగలేదని ఎక్కువ సంఖ్యలో రేషన్ కార్డు దరఖాస్తులు వచ్చాయని, వీటన్నింటిని పరిశీలించిన తర్వాత అర్హులైన లబ్ధిదారులను గుర్తించి వారికి రేషన్ కార్డులు పంపిణీని ప్రభుత్వం మొదలు పెట్టిందని అన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande