తెలంగాణ, నల్గొండ. 25 జూలై (హి.స.)
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలని నల్లగొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి అన్నారు. శుక్రవారం వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా నల్లగొండ జిల్లా కేంద్రంలోని మహిళా డిగ్రీ కళాశాలలో మొక్కలు నాటి మాట్లాడారు. విచక్షణా రహితంగా చెట్లను నరికి వేయడం, అడవుల నిర్మూలన, తదితర కారణాల వల్ల కాలుష్యం పెరిగిపోయి మానవ మనుగడకు ముప్పు ఏర్పడుతుందన్నారు. ఇది భావి తరాలకు దుష్పరిణామాలనిస్తాయన్నారు. అందువల్ల భావి పౌరులైన విద్యార్థులు ఖాళీ స్థలాలు ఉన్న ప్రతిచోట మొక్కలు నాటడమే కాకుండా, వాటికి క్రమం తప్పకుండా నీళ్లు పోస్తూ కాపాడాలన్నారు.
మహిళలు బాగా చదువుకోవాలని, పరిస్థితులకు తగ్గట్టుగా స్పందించాలని, మహిళ దృఢంగా ఉన్నప్పుడే ఇది సాధ్యమవుతుందన్నారు. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఎలా స్పందించాలో ఆలోచించాలని, ఇందుకు చదువు ఒకటే మార్గం అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు