కులఘనన పై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన
హైదరాబాద్, 25 జూలై (హి.స.)ఢిల్లీలోని ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులఘనన పై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీ
కులఘనన పై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన


హైదరాబాద్, 25 జూలై (హి.స.)ఢిల్లీలోని ఇందిరా భవన్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన కులఘనన పై పవర్ పాయింట్ ప్రెసెంటిషన్ టీపీసీసీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ అధ్యక్షతన జరిగింది. ఏఐసీసీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే, ఏఐసీసీ అగ్రనేత, లోక్ సభ ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, ఏఐసీసీ ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, కొండ సురేఖ, వాకాటి శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మహేష్ కుమార్ గౌడ్ మాట్లాడుతూ దేశంలో జనాభా ప్రకారం ఎవరి వాటా వారికి అందాలని ప్రభుత్వ ఫలాలు సమానంగా అందినవుడే సామాజిక న్యాయం సాధ్యమవుతుందని రాహుల్ గాంధీ సంపూర్ణంగా నమ్మారని అన్నారు. ఆయన ఆలోచన విధానం ప్రకారమే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క లు, మంత్రి వర్గం ప్రత్యేక శ్రద్ధ తీస్కొని కులఘనన అన్ని రకాల అంశాలను పరిగణనలోకి తీసుకొని పూర్తి చేసారని అన్నారు.

నేడు దేశానికి తెలంగాణ కులఘనన ఆదర్శంగా నిలిచిందని దేశంలో జనఘననతో పాటు కులఘనన చేస్తామని ప్రకటించడం రాహుల్ గాంధీ, కాంగ్రెస్ పార్టీ విజయమని అన్నారు.

42 శాతం బిసి రిజర్వేషన్ చేసి కాంగ్రెస్ ప్రభుత్వం మాట నిలబెట్టుకుందని అన్నారు. దేశం మొత్తం బిసి రిజర్వేషన్లు అమలు చేసేందుకు ఇది అంకురార్పణ అన్నారు. ఎన్నో ఏళ్ల బిసి కలలను అందరూ సహకరించి అమలు అయ్యేలా చూడాలని ఆయన విజ్ఞప్తి చేసారు

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande