దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతాం.. కేటీఆర్
తెలంగాణ, కామారెడ్డి. 25 జూలై (హి.స.) దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్
కేటీఆర్


తెలంగాణ, కామారెడ్డి. 25 జూలై (హి.స.)

దళిత వ్యతిరేక ప్రభుత్వాన్ని గద్దె దించేదాకా పోరాడతామని, అంబేద్కర్ జయంతి రోజున తమ నాయకుడు సాయిలుకు జరిగిన అవమానానికి ప్రతీకారం తీర్చుకుంటామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కామారెడ్డి జిల్లా లింగంపేటలో సాయిలుకు జరిగిన అవమానానికి నిరసనగా శుక్రవారం ఆత్మ గౌరవ గర్జన నిర్వహించారు.

ఈ సందర్భంగా సాయిలు ఇంటికెళ్లి పరామర్శించారు. అక్కడే సాయితో కలిసి సహపంక్తి భోజనం చేశారు. ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ బాబా సాహెబ్ ను ఘనంగా గౌరవించింది కేవలం తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ ఒక్కరేనని అన్నారు. దళిత కుటుంబాలకు రూ.12 లక్షలు ఇస్తామని ఇవ్వలేదని మండిపడ్డారు. అంతేకాక దళిత డిక్లరేషన్ లో ప్రకటించింది ఏదీ చేయలేదని పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టో ఈ శతాబ్దపు అతి పెద్ద మోసమని తెలిపారు.

ఇక్కడ రైతులకు ఇవ్వాల్సిన డబ్బులు రాహుల్ గాంధీ ఖాతాలోకి వెళ్తున్నాయని విమర్శించారు. సీఎం రేవంత్ రెడ్డి అడబిడ్డలు, పిల్లలను మోసం చేస్తున్నారని, అలాగే కేసీఆర్ ఇచ్చిన ఉద్యోగాలు తానే ఇచ్చానని చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటున్నారని తెలిపారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande