తెలంగాణ, సంగారెడ్డి. 25 జూలై (హి.స.)
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ నిమ్జ్ భూసేకరణ వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రావీణ్య అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఝరాసంగం మండలం చిలేపల్లి, బర్దిపూర్, చిలేపల్లి తాండ, ఎల్గోయి నిమ్డ్ పరిశ్రమల స్థాపన కోసం ప్రభుత్వం సేకరించిన భూములను పరిశీలించారు.నిమ్జ్ భూసేకరణ పరిధిలోకి వచ్చే వివరాల మ్యాపును ద్వారా పరిశీలించారు. ప్రభుత్వం సేకరించిన భూమి, మిగిలిన భూమి వివరాలను అధికారులు అడిగి తెలుసుకున్నారు. భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులు ఆదేశించారు. నూతనంగా ఏర్పాటుచేసిన ఉగ్గేల్లి నుంచి బర్దిపూర్ శివారు వరకు వేసిన రోడ్డును పరిశీలించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు