హైదరాబాద్, 25 జూలై (హి.స.)
బీఆర్ఎస్వీ రాష్ట్ర స్థాయి తెలంగాణ విద్యార్థి సదస్సు రేపు అనగా జూలై 26వ తేదీన జరగనుంది. హైదరాబాద్ ఉప్పల్లోని మల్లాపూర్ వీఎన్ఆర్ గార్డెన్స్లో ఈ సదస్సు జరగనుంది. ఈ సదస్సుకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రులు హరీశ్రావు, జగదీశ్ రెడ్డి తదితరులు హాజరుకానున్నారు. ఈ నేపథ్యంలో సభా స్థలాన్ని స్థానిక ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, గ్యాదరి కిశోర్, బీఆర్ఎస్వీ రాష్ట్ర అధ్యక్షుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ పరిశీలించారు.
శనివారం ఉదయం 10 గంటలకు మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్రావు ఉపన్యాసంతో ఈ సదస్సు ప్రారంభం కానుంది. లంచ్ తర్వాత ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్, మాజీ మంత్రి జగదీశ్ రెడ్డి ప్రసంగిస్తారు. తదనంతరం బీఆర్ఎస్వీ విద్యార్థులకు కేటీఆర్ దిశానిర్దేశం చేయనున్నారు. కాగా, ఈ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు, బీఆర్ఎస్వీ విద్యార్థి నాయకులు పాల్గొని విజయవంతం చేయాలని బీఆర్ఎస్ నాయకులు కోరారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్