రేవంత్ రెడ్డికి నోబెల్ ప్రైజ్ కాదు గోబెల్ ప్రైజ్ ఇవ్వాలి.. బిజెపి చీఫ్
హైదరాబాద్, 25 జూలై (హి.స.) బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులో నేడు వారు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గో
బిజెపి చీఫ్


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు సీఎం రేవంత్ రెడ్డిపై తీవ్రంగా మండిపడ్డారు. హైదరాబాదులో నేడు వారు మీడియాతో మాట్లాడుతూ.. రేవంత్ రెడ్డికి ఆస్కార్ అవార్డు కాదు, భాస్కర్ అవార్డు ఇవ్వాలి.. నోబెల్ ప్రైజ్ కాదు, గోబెల్స్ ప్రైజ్ ఇవ్వాలి అంటూ సెటైర్లు వేశారు. నరేంద్ర మోడీ సీఎం అయ్యే ముందు నుంచే బీసీ.. అప్పటి నుంచి ఎన్నో కులాలు బీసీల్లో కలిసిపోయినట్లు గుర్తు చేశారు. ఇక, రాహుల్ గాంధీ తల్లి తండ్రులు వేర్వేరు మతాలకు చెందినవారు, ఆయన కులం ఏంటి? అని ప్రశ్నించారు. అయితే, పార్టీలో పోస్టుల కోసం ఒత్తిడి చేయొద్దు అన్నారు. మనం అందరం పార్టీ కార్యకర్తలమే, పదవులు వచ్చినవారు ఎక్కువ కాదు, రాని వారు తక్కువ కాదని వెల్లడించారు. వారం రోజుల్లో పార్టీ కొత్త కమిటీని ప్రకటిస్తుంది.. అందులో మొత్తం 20 మందిని నియమిస్తాం.. 33 శాతం మహిళలకు ప్రాధాన్యం ఇస్తామని రామచందర్ రావు చెప్పుకొచ్చారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande