నేడు జరగాల్సిన తెలంగాణ కేబినెట్ మీటింగ్ 28 కి వాయిదా..
హైదరాబాద్, 25 జూలై (హి.స.) సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఏఐసీసీ సమావేశం లో పాల్గొనడానికి గాను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీకి
క్యాబినెట్ మీటింగ్


హైదరాబాద్, 25 జూలై (హి.స.)

సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన శుక్రవారం నిర్వహించాల్సిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశం వాయిదా పడింది. ఏఐసీసీ సమావేశం

లో పాల్గొనడానికి గాను మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, వాకిటి శ్రీహరి ఢిల్లీకి వెళ్లారు.వీరితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, నీటిపారుదలశాఖ మంత్రి ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి కూడా ఢిల్లీ పర్యటనలో ఉన్నారు. ఐదుగురు మంత్రులు ఢిల్లీలోనే ఉన్న కారణంగా కేబినెట్‌ సమావేశాన్ని వాయిదా వేయాలని నిర్ణయించారు. ఈ భేటీని ఈ నెల 28న మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహిస్తామని వెల్లడించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande