గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు.. ప్రమాణ
గోవా, 26 జూలై (హి.స.)గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 11.30 గంటలకు ర
గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు.. ప్రమాణ


గోవా, 26 జూలై (హి.స.)గోవా గవర్నర్ గా అశోక్ గజపతిరాజు ఈ రోజు ఉదయం ప్రమాణ స్వీకారం చేశారు. గోవా ముఖ్యమంత్రి ప్రమోద్ సావంత్, మంత్రి వర్గ సభ్యుల సమక్షంలో బాంబే హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఆలోక్‌ అరాధే ఆయనతో ప్రమాణం చేయించారు. ఉదయం 11.30 గంటలకు రాజ్‌భవన్‌ బంగ్లా దర్బార్‌ హాల్‌లో ఈ కార్యక్రమం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి అశోక్ గజపతిరాజు కుటుంబ సభ్యులతో పాటు కేంద్రమంత్రి రామ్మోహన్‌ నాయుడు, పలువురు ఎంపీలు, ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రులు నారా లోకేశ్‌, సంధ్యారాణి, కొండపల్లి శ్రీనివాస్‌తో పాటు పలువురు టీడీపీ నేతలు హాజరయ్యారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande