తెలంగాణ, ఆసిఫాబాద్.
26 జూలై (హి.స.)
జిల్లాలో విలేజ్ పోలీస్ వ్యవస్థను
పటిష్టంగా అమలు చేయాలని ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కాంతిలాల్ పాటిల్ అన్నారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ అధికారులకు నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు పోలీసులు ప్రజలకు పారదర్శకంగా పనిచేసి, వారి మన్ననలు పొందాలని సూచించారు. ఇందుకోసం విలేజ్ పోలీస్ వ్యవస్థను పటిష్టం చేస్తూ, స్టేషన్ పెండింగ్ కేసులు పెండింగ్ లేకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామాల్లో కార్డెన్ సెర్చ్ చేపట్టి సైబర్ నేరాలు, మాదకద్రవ్యాల పై ప్రజలకు అవగాహన కల్పించాలని అలాగే స్టేషన్ పరిధిలో రాత్రుల్లో పెట్రోల్ పెంచి దొంగతనాలను నియంత్రించాలని చెప్పారు. అలాగే రౌడీ షీట్స్, పాత నేరస్తుల కదలికలతో పాటు అక్రమ రవాణాపై నిఘా పెంచాలని ఆదేశించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు