హైదరాబాద్, 27 జూలై (హి.స.) బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్
కేటీఆర్, ఎంపీ సీఎం రమేశ్ పరస్పర విమర్శలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ స్పందించారు. ఆదివారం బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. సీఎం రమేశ్ ను కరీంనగర్ కు తీసుకొచ్చే బాధ్యత నాది.. చర్చకు కేటీఆర్ సిద్ధమా? అని సవాల్ చేశారు. దమ్ముంటే టైమ్, డేట్ కేటీఆర్ ఫిక్స్ చేయాలని అన్నారు. కేటీఆర్ కు సీఎం రమేశ్ ఆర్థికసాయం చేశారని కీలక వ్యాఖ్యలు చేశారు.. అయినా కూడా విశ్వాసం లేకుండా రమేశ్ పై వ్యాఖ్యలు చేయడం కరెక్ట్ కాదని అన్నారు. కేటీఆర్ సంస్కారం లేకుండా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. బీఆర్ఎస్ పార్టీని నడిపే స్థితిలో ఆ పార్టీలో ఎవరూ లేరని.. అందుకే బీజేపీలో విలీనం చేస్తామని గతంలో ఒప్పందానికి వచ్చారని సంచలన వ్యాఖ్యలు చేశారు. విలీనం, వారసత్వ రాజకీయాలకు తాము వ్యతిరేకం అని.. అందుకే తిరస్కరించామని చెప్పారు.
కాగా, తెలంగాణలో సీఎం రమేశ్ కు రేవంత్ రెడ్డి రూ.1660 కోట్ల నామినేషన్ వర్క్ ఇచ్చారని కేటీఆర్ ఆరోపించిన విషయం తెలిసిందే..
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్