హుజురాబాద్, 27 జూలై (హి.స.)
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసినట్టుగా ఆరోపిస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజురాబాద్ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు మ్యాకల తిరుపతి ఇచ్చిన ఫిర్యాదుతో కేసు నమోదైంది. ఈ ఘటనకు సంబంధించి కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యే దిష్టిబొమ్మను దహనం చేసి నిరసన తెలిపారు. అనంతరం పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు అందజేశారు. ఫిర్యాదు ఆధారంగా హుజురాబాద్ పోలీసులు విచారణ జరిపి బిఎన్ఎస్ చట్టంలోని 352, 353, 1(b), 353(2) సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్