శ్రీశైలం దర్శనానికి వెళ్తుంటే కారు ప్రమాదం.. ముగ్గురికి గాయాలు
తెలంగాణ, నాగర్ కర్నూల్. 27 జూలై (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద చెట్టును కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు నుండి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న యువకు
కారు ప్రమాదం


తెలంగాణ, నాగర్ కర్నూల్. 27 జూలై (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్

మండలం హైదరాబాద్ శ్రీశైలం జాతీయ రహదారి బ్రహ్మగిరి (దోమల పెంట) వద్ద చెట్టును కారు ఢీకొట్టిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. హైదరాబాద్ వైపు నుండి శ్రీశైలం దర్శనానికి వెళ్తున్న యువకులతో కూడిన కారు బ్రహ్మగిరి సమీపంలో మలుపు వద్ద అదుపుతప్పి చెట్టును బలంగా ఢీకొట్టింది. కారు వేగంగా ఢీకొట్టడంతో చెట్టు నేలకొరిగిందని, కారులో ఉన్న ముగ్గురికి తీవ్రగాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. క్షతగాత్రులను ప్రైవేటు అంబులెన్స్ ద్వారా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande