కేటీఆర్ వ్యాఖ్యలను ఖండించిన బిజెపి ఎంపీ సీఎం రమేష్
హైదరాబాద్, 26 జూలై (హి.స.) మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎమ్ రమేష్ పై కీలక ఆరోపణలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎ
బిజెపి ఎంపీ


హైదరాబాద్, 26 జూలై (హి.స.)

మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్

ప్రెసిడెంట్ కేటీఆర్ బీజేపీ ఎంపీ సీఎమ్ రమేష్ పై కీలక ఆరోపణలు చేశారు. కంచె గచ్చిబౌలి భూముల తనఖా వెనుక బీజేపీ ఎంపీ సీఎం రమేష్ ఉన్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. భూములు తనఖాకు సహాయం చేసినందుకు సీఎం రమేష్ కు ఫ్యూచర్ సిటీలో రేవంత్ రెడ్డి రూ.1600 కోట్ల రోడ్ల కాంట్రాక్టులు కట్టబెట్టారని ఆరోపించారు. ఇది ముమ్మాటికీ బీజేపీ, కాంగ్రెస్ మధ్య అక్రమ సంబంధం అన్నారు. కేంద్ర సాధికారత కమిటీ రిపోర్టు పై ఇప్పటి వరకు బీజేపీ ఎందుకు చర్యలు తీసుకోలేదో, ఎందుకు మౌనంగా ఉందో తెలపాలని కేటీఆర్ డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.

అయితే కెటీఆర్ ఆరోపణలపై ఎంపీ రమేష్ ఈ రోజు మీడియాతో మాట్లాడుతూ.. సంచలన వ్యాఖ్యలు చేశారు. కేటీఆర్ ఒళ్లు దగ్గర పెట్టుకుని మాట్లాడాలని వార్నింగ్ ఇచ్చాడు. కంచ గచ్చిబౌలిలో పలు కంపెనీలు టెండర్లు వేశాయి. అందులో నాకు ఎటువంటి టెండర్లు రాలేదు. ఫ్యూచర్ సిటీలో వేసిన టెండర్లకు అన్ని నిబంధనల ప్రకారం.. రుత్విక్ కంపెనీకి టెండర్ వచ్చిందని క్లారిటీ ఇచ్చారు. టెండర్ల విషయంలో వాస్తవాలు తెలియకుండా కేటీఆర్ మాట్లాడుతున్నాడని, ఎవరితోనైనా దోస్తానా చేస్తే టెండర్లు ఇస్తారా అని ఎంపీ రమేష్ కేటీఆర్ను ప్రశ్నించారు.

అలాగే కేటీఆర్ కవిత సహా బీఆర్ఎస్ నేతలు ఢిల్లీలోని తన ఇంటికి ఎందుకు వచ్చారో మర్చిపోయారా అని ప్రశ్నించారు. వారిపై వివిధ వ్యవహారాల్లో విచారణలు జరగకుండా చూడాలని కేటీఆర్ అడగడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande