తెలంగాణ, యాదాద్రి భువనగిరి. 26 జూలై (హి.స.)
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు పక్షపాతిగా పాలన సాగిస్తుందని భువనగిరి శాసనసభ్యులు కుంభ అనిల్ కుమార్ రెడ్డి అన్నారు. శనివారం వారు వలిగొండ
మండలంలోని పలు గ్రామాలలో అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. అనంతరం మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో రెండు కోట్ల 20 లక్షల రూపాయలతో నిర్మించ తలపెట్టిన గోదాముల పనులకు ఎమ్మెల్యే శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి పెద్దపీట వేస్తూ సాగునీటి కాలువలకు రైతాంగ అభివృద్ధికి అనేక వనరులను వెచ్చించి తోడ్పాటును అందిస్తుందని అన్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు