పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు
సింగపూర్, 27 జూలై (హి.స.) పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస
పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూలం: చంద్రబాబు


సింగపూర్, 27 జూలై (హి.స.)

పోర్టులు, గ్రీన్ ఎనర్జీ సహా వివిధ రంగాల్లో పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ లో పుష్కలంగా అవకాశాలు ఉన్నాయని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు. సింగపూర్ కంపెనీలు ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు వీలుగా ప్రోగ్రెసివ్ పాలసీలు అమలు చేస్తున్నట్లు వెల్లడించారు. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి చంద్రబాబుతో అక్కడి భారత హై కమిషనర్ శిల్పక్ ఆంబులేతో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు.

సింగపూర్ ప్రభుత్వంలో, పారిశ్రామిక వేత్తల్లో సీబీఎన్ బ్రాండ్‌కు ప్రత్యేక గుర్తింపు ఉందని భారత హై కమిషనర్ ఆంబులే ముఖ్యమంత్రి చంద్రబాబుకు తెలిపారు.

వివిధ రంగాల్లో సింగపూర్ సాధించిన ప్రగతి, వృద్ధి, ఆ దేశంలో అమలుచేస్తున్న ప్రభుత్వ పాలసీలు, సింగపూర్‌లో భారతీయుల కార్యకలాపాల గురించి భారత హై కమిషనర్ సీఎంకు వివరించారు. ఆరోగ్య రంగం, గ్రీన్ హైడ్రోజన్, ఏవియేషన్, సెమి కండక్టర్స్, పోర్టులు, పారిశ్రామిక రంగాల్లో సింగపూర్ అనుసరిస్తున్న విధానాలపై తెలియజేశారు. భారత్‌ తో సింగపూర్ ప్రభుత్వం మంచి సంబంధాలను కలిగి ఉందని వివరించారు. భారత్‌లో ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులకు సింగపూర్ సంస్థలు ఆసక్తిగా ఉన్నాయని భారత హైకమిషనర్ ఏపీ ముఖ్యమంత్రికి తెలిపారు.

గతంలో సింగపూర్‌తో కలిసి అమరావతి ప్రాజెక్టును చేపట్టామని.. కొన్ని కారణాల వల్ల రాజధాని ప్రాజెక్టు నుంచి సింగపూర్ వైదొలిగిందని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. 2019-24 మధ్య జరిగిన పరిణామాలు దీనికి కారణమయ్యాయన్నారు. ప్రస్తుతం తన పర్యటనలో గతంలో జరిగిన అపోహల్ని తొలగించి రికార్డులను సరిచేసేందుకు ప్రయత్నిస్తానని ముఖ్యమంత్రి వ్యాఖ్యానించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande