తిరుమలలో మళ్లీ పెరిగిన భక్తుల రద్దీ
తిరుమల, 27 జూలై (హి.స.) కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల పోటెత్తుతున్నారు. అయితే వరుసగా కురిసిన భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్ధీ స్వల్పంగా (crowd of devotees) తగ్గింది. అయితే ఈ రోజు ఆదివారం కావడం శనివ
తిరుమల


తిరుమల, 27 జూలై (హి.స.)

కలియుగ దైవం తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనానికి భక్తుల పోటెత్తుతున్నారు. అయితే వరుసగా కురిసిన భారీ వర్షాల కారణంగా నాలుగు రోజుల పాటు తిరుమలలో భక్తుల రద్ధీ స్వల్పంగా (crowd of devotees) తగ్గింది. అయితే ఈ రోజు ఆదివారం కావడం శనివారం సాయంత్రానికి వర్షాలు కూడా తగ్గుముఖం పట్టడంతో.. శ్రీవారిని దర్శించుకునేందుకు భక్తులు పోటెత్తారు. దీంతో ఆదివారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకునేందుకు 26 కంపార్ట్మెంట్లలో వేచి ఉన్నారు. దీంతో టోకెన్లు లేని భక్తులకు సర్వదర్శనానికి 12 గంటల సమయం పడుతుందని టీటీడీ అధికారులు (TTD officials) తెలిపారు. ఇదిలా ఉంటే అధికారులు తీసుకుంటున్న చర్యలతో నిన్న ఒక్కరోజు శ్రీవారిని 85,740 మంది భక్తులు దర్శించుకున్నారు. వారిలో 35,555 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించుకున్నారు. అలాగే భక్తుల నుంచి హుండీల ద్వారా రూ. 3.41 కోట్ల ఆదాయం వచ్చినట్లు టీటీడీ అధికారులు స్పష్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande