జగిత్యాల, 26 జూలై (హి.స.)
భూభారతి రెవెన్యూ సదస్సుల్లో రైతులు చేసుకున్న దరఖాస్తులను ఆగస్టు 15 లోగా పరిశీలన చేయాలని జగిత్యాల జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. పెగడపల్లి తహసీల్దార్ కార్యాలయాన్ని కలెక్టర్ శనివారం తనిఖీ చేశారు. రైతులు చేసుకున్న ప్రతీ దరఖాస్తును క్షుణ్నంగా పరిశీలించి నివేదిక రూపొందించాలని, అలాగే మీ సేవా కేంద్రాల సర్టిఫికెట్లను పెండింగ్ లేకుండా మంజూరు చేయాలని కలెక్టర్ సూచించారు. ---------------
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్