అభివృద్ధికి ఆటంకం కలిగిస్తే ఊరుకునేది లేదు : ఎమ్మెల్యే పవార్ రామారావు
తెలంగాణ, నిర్మల్. 26 జూలై (హి.స.) అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తే ఊరుకునే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని, రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం వారు భైంసా
ఎమ్మెల్యే పవర్


తెలంగాణ, నిర్మల్. 26 జూలై (హి.స.)

అభివృద్ధి విషయంలో ఆటంకం కలిగిస్తే

ఊరుకునే ప్రసక్తే లేదని ముథోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ అన్నారు. అర్హులందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయిస్తానని, రాని వారు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శనివారం వారు భైంసా మండలంలోని సిరాల గ్రామంలో ఇందిరమ్మ ఇండ్లను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడారు. ఎన్నికలప్పుడే రాజకీయాలు కానీ, అభివృద్ధి విషయంలో అందరు కలిసికట్టుగా ఉండాలన్నారు. పార్టీలకు అతీతంగా అర్హులందరికీ ఇండ్లు ఇప్పిస్తానని, పేదలకు అన్యాయం చేస్తానంటే ఊరుకునే ప్రసక్తే లేదని అన్నారు. అభివృద్ధి విషయంలో అడ్డంకులు సృష్టించవద్దని సూచించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande