తెలంగాణ, జగిత్యాల. 26 జూలై (హి.స.)
ప్రభుత్వం నూతనంగా మంజూరు చేసిన రేషన్ కార్డు లబ్ధిదారులందరికీ ఇందిరమ్మ ఇండ్లు, గృహజ్యోతి, పెన్షన్ మంజూరు వంటి సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ స్పష్టం చేశారు. జగిత్యాల జిల్లా పెగడపల్లి మండల కేంద్రంలో రేషన్ కార్డు లబ్ధిదారులకు కలెక్టర్ సత్యప్రసాద్ తో కలిసి మంత్రి శనివారం ప్రొసిడింగ్ పత్రాలు, కళ్యాణ లక్ష్మి లబ్ధిదారులకు చెక్కులను పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ రేషన్ కార్డుల మంజూరు ప్రక్రియ నిరంతరం కొనసాగుతుందని, రేషన్ కార్డు మంజూరైన వారికి వెంట వెంటనే ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నట్లు తెలిపారు. నియోజక వర్గ ప్రజలకు ఎల్లవేలలా అందుబాటులో ఉంటూ ప్రజలకు పూర్తి స్థాయిలో సేవలు అందిస్తానని, ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని అన్నారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు