సబ్సిడీ యూరియాను వ్యవసాయేతర పనులకు వినియోగిస్తే కఠిన చర్యలు: కలెక్టర్ ఇలా త్రిపాఠి
తెలంగాణ, నల్గొండ. 26 జూలై (హి.స.) ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇచ్చే యూరియాను వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు వినియోగించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంల
కలెక్టర్ ఇలా త్రిపాఠి


తెలంగాణ, నల్గొండ. 26 జూలై (హి.స.)

ప్రభుత్వం రైతులకు సబ్సిడీపై ఇచ్చే

యూరియాను వ్యవసాయానికి కాకుండా వ్యవసాయేతర పనులకు వినియోగించినట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని నల్గొండ జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి హెచ్చరించారు. శనివారం చిట్యాల మండలంలోని వెలిమినేడు గ్రామంలో ఉన్న డీఈఎఫ్ సేల్ కౌంటర్ ను జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తో కలిసి ఆమె తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ..

ప్రభుత్వం రైతులకు అందించే యూరియాను వ్యవసాయ పనులకు మాత్రమే వాడాలని, ఇండస్ట్రీలకు వాడొద్దని అన్నారు. కంపెనీలలో ఇండస్ట్రీ యూరియాని మాత్రమే వాడాలన్నారు. జిల్లాలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు, రైతు సేవా కేంద్రాల ద్వారా అమ్ముతున్న ఎరువుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రత్యేకించి యూరియాని ఎవరైనా దారి మళ్లించే చర్యలకు పాల్పడితే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande