విద్య ద్వారానే పేదరిక నిర్మూలన : కలెక్టర్ సందీప్ కుమార్ ఝా
తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 26 జూలై (హి.స.) విద్య ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆన్ అకాడమీ ద్వారా
కలెక్టర్ సందీప్


తెలంగాణ, రాజన్న సిరిసిల్ల. 26 జూలై (హి.స.)

విద్య ద్వారా మాత్రమే పేదరిక నిర్మూలన సాధ్యమని రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ ఝా అన్నారు. శనివారం జిల్లాలోని ఇల్లంతకుంట మండలం రహింఖాన్ పేట గ్రామంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో ఆన్ అకాడమీ ద్వారా ఏర్పాటు చేసిన ఆన్లైన్ తరగతులను ఆయన స్థానిక ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే లక్ష్యంగా ఆన్లైన్ తరగతులు ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ప్రతి విద్యార్థి ప్రతి రోజు కనీసం 2 గంటల పాటు ఆన్ లైన్ కోచింగ్ తీసుకోవాలని తెలిపారు. విద్యార్థి జీవితంలో 10,11,12వ తరగతులు 3 సంవత్సరాలు చాలా కీలక సమయమని, విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande