కొత్త నాయకులకు తెలంగాణ జాగృతి అండగా ఉంటుంది.. ఎమ్మెల్సీ కవిత
తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 26 జూలై (హి.స.) తెలంగాణ జాగృతి సంస్థను కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగ
ఎమ్మెల్సీ కవిత


తెలంగాణ, మేడ్చల్ మల్కాజ్గిరి. 26 జూలై (హి.స.)

తెలంగాణ జాగృతి సంస్థను

కొత్త సంస్థగా మార్చేందుకు ఆలోచనలు చేస్తున్నామని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. ఆగస్టు 6వ తేదీన ప్రొ.జయశంకర్ సార్ జయంతి సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా జంబో కమిటీలు వేయబోతున్నామని ఆమె వెల్లడించారు. ఇవాళ మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కొంపల్లిలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో జరిగిన 'లీడర్' శిక్షణా తరగతులకు హాజరైన కవిత మాట్లాడుతూ.. జంబో కమిటీల ఏర్పాటు తర్వాత ఇలాంటి కార్యక్రమాలు ప్రతిజిల్లాలో నిర్వహిస్తామని చెప్పారు. ప్రతి ఒక్కరిలో నాయకుడు ఉంటారు. ఆ నాయకత్వ లక్షణాలను పెంపొందించుకుని సమాజం మంచి కోసం ఉపయోగించుకోవడానికి తెలంగాణ జాగృతి ఒక వేదిక కావాలన్నారు.

సమాజంలో మార్పు తేవడంలో రాజకీయాలు ఓ మార్గం అని, పాలిటిక్స్లోకి రావాలనుకునే వారికి, ఎటువంటి బ్యాక్ గ్రౌండ్ లేదు అనుకునే వారికి తెలంగాణ జాగృతి అండగా ఉంటుందన్నారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande