అనాధ పసి బిడ్డను చూసి భావోద్వేగానికి గురైన కలెక్టర్ దంపతులు
హైదరాబాద్, 26 జూలై (హి.స.) జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సతీమణి డాక్టర్ సయ్యద్ అమ్రిన్ మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది. కనికరం లేని ఓ తల్లి, కళ్ళు తెరవని పసిబిడ్డను,వదిలి వెళ్ళిపోతే విషయం తెలిసిన ఓ అమ్
కలెక్టర్ దంపతులు


హైదరాబాద్, 26 జూలై (హి.స.) జనగామ జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సతీమణి డాక్టర్ సయ్యద్ అమ్రిన్ మానవత్వానికి నిదర్శనంగా నిలిచిన సంఘటన శుక్రవారం రాత్రి చోటుచేసుకుంది.

కనికరం లేని ఓ తల్లి, కళ్ళు తెరవని పసిబిడ్డను,వదిలి వెళ్ళిపోతే విషయం తెలిసిన ఓ అమ్మ మనసు ఆ బిడ్డ పైకి లాగింది. బిడ్డ ఆరోగ్యం ఎలా ఉందొ ఒక్కసారి ఆ బిడ్డను చూడాలని ఒక్కసారి తన వొడిలోకి తీసుకోవాలని అనుకున్నది ఆ అమ్మ.. ఆ అమ్మ మరెవరో కాదు జనగామ జిల్లా కలెక్టర్ సతీమణి డాక్టర్ సయ్యద్ అమ్రిన్.

జనగాం జిల్లా, రఘునాథపల్లి మండలంలోని కిలాశాపూర్ గ్రామంలో 9 రోజుల క్రితం గుర్తుతెలియని వ్యక్తులు వదిలి వెళ్ళిన నవజాత మగ శిశువు ప్రస్తుతం మహిళా శిశు ఆరోగ్య కేంద్రం జనగాంలో వైద్య పర్యవేక్షణలో ఉన్న విషయం తెలిసిందే. శుక్రవారం రాత్రి ఆ పసి బిడ్డను చూడటానికి కలెక్టర్ దంపతులు ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించారు. ఆ బిడ్డను చూడాలని ఆనాడే.. కలెక్టర్ దంపతులు అనుకున్నప్పటికి అప్పుడే పుట్టిన బిడ్డ అందులోను ఎలాంటి కనీస వైద్యం అందని ఆ బిడ్డకి ఇన్ఫెక్షన్ లు సోకే అవకాశాలు ఉన్న నేపథ్యంలో మెరుగైన వైద్యం అందిన తర్వాత శుక్రవారం రాత్రి బిడ్డను చూడటానికి కలెక్టర్ దంపతులు ఏంసీహెచ్ కి వచ్చారు. ముందుగా శిశువును కలెక్టర్ సతీమణి కాసేపు తన వొడిలోకి తీసుకోని లాలించింది తాను కూడా ఒక చిన్నారికి తల్లి కదా పసి బిడ్డకి తల్లి అవసరం ఎంత అవసరమో తెలుసుకొని బావోద్వేగానికి లోను అయ్యింది. ఎంతో ముద్దుగా ఉన్న ఆ బిడ్డను చూసి ఓ పక్క సంతోషంతో మరో పక్క బాధతోనే బిడ్డకు తానే స్వయంగా అమ్మగా పాలు తాపించింది.

బిడ్డలు దేవుడు ఇచ్చే వరమని.. అలాంటి బిడ్డలను అనాధగా వదిలి వెళ్లి పోవడం చాలా బాధాకరమన్నారు. అనంతరం శిశువు ఆరోగ్య పరిస్థితి, చికిత్సపరమైన వివరాలను డాక్టర్లు, వైద్య సిబ్బందిని కలెక్టర్ దంపతులు అడిగి తెలుసుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande