అమరావతి, 26 జూలై (హి.స.)
ఏపీ మద్యం కేసు నిందితుల నివాసాలు, కార్యాలయాల్లో సిట్ సోదాలు చేపట్టింది. ఈ కేసులో నిందితుడు రాజ్ కెసిరెడ్డి కార్యాలయంలో సిట్ అధికారులు సోదాలు చేస్తున్నారు. బాలాజీ గోవిందప్ప ఉండే భారతి సిమెంట్స్ కార్యాలయంలోనూ సోదాలు కొనసాగుతున్నాయి. నానక్‌రామ్‌గూడలో చాణక్యకు చెందిన టీగ్రిల్ రెస్టారంట్‌లోనూ తనిఖీలు చేపట్టారు. మద్యం కేసు నిందితులు ఎక్కడ సమావేశమయ్యారనే అంశాలపై సిట్ అధికారులు ఆరా తీస్తున్నారు. సాంకేతిక ఆధారాలు సేకరించి సోదాలు చేస్తున్నారు. మధ్యాహ్నం నుంచి సిట్ సోదాలు కొనసాగుతున్నాయి. ఏడుగురు అధికారులతో కూడిన సిట్ బృందం సోదాలు చేస్తోంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల రాజీవ