ములుగు జిల్లా ఫారెస్టులో ఏడుగురు విద్యార్థులు మిస్సింగ్.. రక్షించిన పోలీస్ సిబ్బంది.
ములుగు, 27 జూలై (హి.స.) ములుగు జిల్లా మైతాపురం ఫారెస్ట్లో విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం జిల్లాలోని జలపాతాలను సందర్శించేందుకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పిపోయారు. వెంటనే విషయాన్ని గుర్తించి అప్రమత్తమైన
విద్యార్థుల మిస్సింగ్


ములుగు, 27 జూలై (హి.స.)

ములుగు జిల్లా మైతాపురం ఫారెస్ట్లో విద్యార్థుల అదృశ్యం కలకలం రేపింది. ఆదివారం జిల్లాలోని జలపాతాలను సందర్శించేందుకు వెళ్లిన ఏడుగురు విద్యార్థులు తిరుగు ప్రయాణంలో అడవిలో దారి తప్పిపోయారు. వెంటనే విషయాన్ని గుర్తించి అప్రమత్తమైన విద్యార్థులు డయల్ 100కు ఫోన్ చేశారు. వెంటనే స్పందించిన వెంకటాపురం పోలీస్ స్టేషన్కు చెందిన సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని, అడవిలో గాలింపు చేపట్టి విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు. విద్యార్థులను రక్షించినందుకు పోలీసులకు స్థానికులు, తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. మైతాపురం అడవి ప్రాంతంలో జలపాతాల పక్కన సందర్శనకు వెళ్లే పర్యాటకులు తప్పనిసరిగా గైడ్ సాయంతోనే వెళ్లాలని అధికారులు ఈ సందర్భంగా సూచించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande