సిద్దిపేట జిల్లాలో పర్యటించిన మంత్రి పొన్నం
సిద్దిపేట, 27 జూలై (హి.స.) మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని చదును చేస్తున్న పనుల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగ
మంత్రి పొన్నం


సిద్దిపేట, 27 జూలై (హి.స.)

మంత్రి పొన్నం ప్రభాకర్ ఆదివారం సిద్దిపేట జిల్లాలో పర్యటించారు.

కోహెడ మండలం తంగలపల్లి గ్రామంలో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ స్థలాన్ని చదును చేస్తున్న పనుల పై అధికారులను అడిగి తెలుసుకున్నారు. పనులు వేగంగా పూర్తి చేయాలని, స్థలంలో ఉన్న విద్యుత్ పోల్స్ షిఫ్ట్ చేయాలని ఆదేశించారు.స్థలం చుట్టూరా ఇప్పటి నుండే కరివేపాకు,మునగ, జామ తదితర మొక్కలు నాటాలని సూచించారు.యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ మ్యాప్ పరిశీలించారు. స్కూల్ బిల్డింగ్స్, గ్రౌండ్ తదితర వాటిపై మంత్రి కి కలెక్టర్ వివరించారు. స్కూల్ స్థలానికి రోడ్డు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. అనంతరం కోహెడ నుండి తంగలపల్లి క్రాస్ రోడ్డు వయా కూరెళ్ళ వరకు రూ. 1.55 లక్షల వ్యయంతో బీటీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande