ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి : మంత్రులు
భద్రాద్రి కొత్తగూడెం., 27 జూలై (హి.స.) ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతి పై ఆదివారం పాల్వంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు మంత్రి పొంగు
మంత్రులు


భద్రాద్రి కొత్తగూడెం., 27 జూలై (హి.స.)

ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాల్లో సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి పనుల పురోగతి పై ఆదివారం పాల్వంచలోని ఐడీఓసీ భవనంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఎంపీలు పోరిక బలరాం నాయక్, రామసహాయం రఘురాం రెడ్డి, ఎమ్మెల్యేలు, వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు, కలెక్టర్లు, ఎస్పీలు, సమావేశానికి హాజరయ్యారు.

సమావేశంలో జిల్లాలో కురుస్తున్న వర్షాల పరిస్థితి, ముంపు ప్రాంతాల్లో తలెత్తుతున్న సమస్యలు, సీజనల్ వ్యాధుల వ్యాప్తి, రైతులకు ఎరువుల లభ్యత, ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పురోగతి, అభివృద్ధి పనుల నాణ్యత, రేషన్ కార్డుల పంపిణీ, వివిధ సంక్షేమ పథకాల అమలు తీరు పై సమగ్రంగా చర్చ జరిగింది.

ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ గత ఏడాది మాదిరిగా ముంపు పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ముంపు ప్రాంతాల్లో తాత్కాలిక నివాస శిబిరాలను సిద్ధం చేయాలని సూచించారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ ప్రభుత్వం ప్రధానంగా మహిళల సంక్షేమం పై దృష్టి సారించిందని అన్నారు. మహిళలను లక్షాధికారులుగా చేయడమే ప్రజా ప్రభుత్వం లక్ష్యమన్నారు. .

మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మాట్లాడుతూ ఇది పేదవాడి ప్రభుత్వం అని సంక్షేమానికి పెద్ద పీట వేస్తున్నామన్నారు. నూతన రేషన్ కార్డులు, సన్న బియ్యం, రైతు భరోసా, ఇందిరమ్మ ఇండ్లు, ఉచిత కరెంటు వంటి పథకాలను ప్రజలకి అందించేందుకు ప్రభుత్వం పకడ్బందీగా నిర్వహిస్తుందన్నారు.

మంత్రి వాకిటి శ్రీహరి మాట్లాడుతూ చేపల పెంపకం పై సంబంధిత శాఖ అధికారులు దృష్టి సారించాలన్నారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన యంగ్ ఇండియా స్కూళ్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande