మేడారం సమ్మక్క సారలమ్మ భక్తులకు గుడ్ న్యూస్..
ములుగు, 27 జూలై (హి.స.) ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతుల
మేడారం


ములుగు, 27 జూలై (హి.స.)

ములుగు జిల్లాలోని మేడారంలో గెస్ట్ హౌస్ నిర్మాణానికి రూ.5 కోట్ల నిధులు విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటికే నాలుగు సూట్ల గెస్ట్ హౌస్ నిర్మాణానికి ఆర్ అండ్ బీ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వికాస్ రాజ్ అనుమతులు ఇచ్చారు. దీంతో మంత్రి సీతక్క ప్రయత్నం సఫలం అయిందని స్థానికంగా హర్షం వ్యక్తం చేశారు. కాగా, కుంభమేళాను తలపించే సమ్మక్క-సారలమ్మ అతి పెద్ద గిరిజన జాతరకు వచ్చే కోట్లాది మంది భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాట్లు ప్రణాళిక బద్ధంగా ఉండాలని మంత్రి సీతక్క అన్నారు. జాతరలో డ్రింకింగ్ వాటర్, టాయిలెట్స్, విద్యుత్ శాఖ, రోడ్లు మరమ్మతులపై రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే నిధులు కేటాయించిన విషయాన్ని తెలియజేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande