హైదరాబాద్, 26 జూలై (హి.స.)
సికింద్రాబాద్ లోని సృష్టి టెస్ట్ ట్యూబ్
బేబీ కేంద్రంలో భారీ మోసం బయట పడింది. పిల్లల కోసం వచ్చిన దంపతులకు భర్త వీర్యకణాలతో కాకుండా ఇతరుల వీర్యకణాలతో గర్భం దాల్చేటట్లు చేసిన సంఘటన చోటు చేసుకుంది. పుట్టిన బాబుకు క్యాన్సర్ రావడంతో అనుమానంతో తల్లిదండ్రులు డీఎన్ఏ పరీక్షలు చేయించగా నిజం బయట పడింది. బాధితులు గోపాల పురం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు స్వీకరించిన నార్త్ జోన్ పోలీసులు శనివారం మధ్యాహ్నం సృష్టి ట్యూబ్ బేబీ కేంద్రం పై దాడులు నిర్వహించారు. విషయాన్ని గోప్యంగా ఉంచి నార్త్ జోన్ డీసీపీ సాధన రష్మీ పెరుమాళ్, సికింద్రాబాద్ ఆర్డీఓ సాయి రామ్, డీఎంహెచ్ డా. వెంకటి ఆధ్వర్యంలో హాస్పిటల్ కి చేరుకొని తనిఖీలు చేస్తున్నారు. హాస్పిటల్ అధినేత తో పాటు వైద్యులు, సిబ్బందిని విచారణ చేస్తున్నారు.బాధితుల వివరాలను కూడా పోలీసులు గోప్యంగా ఉంచారు. నార్త్ జోన్ పోలీసులు టెస్ట్ ట్యూబ్ బేబీ కేంద్రం ఎండీ నర్మద తో వైద్య సిబ్బందిపై నార్త్ జోన్ పోలీసులు విచారణ జరుపుతున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్