వైద్య సిబ్బంది తీరుపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్..పలువురు ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు
తెలంగాణ, 26 జూలై (హి.స.) యాదగిరిగుట్ట పీహెచ్సీలో పనిచేసే వైద్య సిబ్బంది తీరుపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రాథమిక వైద్యారోగ్
యాదాద్రి కలెక్టర్


తెలంగాణ, 26 జూలై (హి.స.)

యాదగిరిగుట్ట పీహెచ్సీలో పనిచేసే వైద్య సిబ్బంది తీరుపై కలెక్టర్ హనుమంతరావు సీరియస్ అయ్యారు. ఎలాంటి ముందస్తు అనుమతులు లేకుండానే విధులకు గైర్హాజరైన ఉద్యోగులపై చర్యలు తప్పవని హెచ్చరించారు. శనివారం పట్టణంలోని ప్రాథమిక వైద్యారోగ్య కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. వైద్య సిబ్బంది రిజిస్టర్ను పరిశీలించారు. విధులకు సిబ్బంది హాజరవుతున్నారా, ఎంత మంది ఫీల్డ్లో ఉన్నారని ఆరా తీశారు.

ఈ క్రమంలో విధులకు హాజరు కాని సీనియర్ అసిస్టెంట్ వంశీ దీపక్, ల్యాబ్ టెక్నిషియన్ సుగుణ రాజుకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. సెలవులో వెళ్లిన సిబ్బంది తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. హాజరు రిజిస్టర్ క్రమశిక్షణ పద్దతిని పాటించాలన్నారు. వైద్య సేవలకు వచ్చే రోగులకు పరీక్షలు నిర్వహించి మెరుగైన చికిత్స అందజేయాలన్నారు. వానాకాలం సీజన్ సందర్భంగా వైద్యులు అందుబాటులో ఉండాలని పేర్కొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande